మొదటి టీ20లో టీమిండియాపై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది.

దీంతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది.

ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0) ఘోరంగా విఫలం అయ్యారు.

దీంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

అయితే సూర్యకుమార్ యాదవ్ (47), వాషింగ్టన్ సుందర్ (50) 68 పోరాడి ఆశలు రేకెత్తించారు.

కానీ కీలక సమయంలో వీరు కూడా అవుటయ్యారు.

న్యూజిలాండ్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (52), డేరిల్ మిషెల్ (59) అర్థ సెంచరీలు సాధించారు.

All Images Credits: BCCI Twitter