ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. తొలిరోజు ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించింది. మొదట 98కే 5 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఒత్తిడి పెంచింది. రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6) సెంచరీ కొట్టాడు. రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్; 163 బంతుల్లో 10x4) నాటౌట్గా నిలిచాడు. పంత్, జడ్డూ ఆరో వికెట్‌కు 239 బంతుల్లోనే 222 రన్స్ కొట్టారు. 89 బంతుల్లోనే సెంచరీ కొట్టేసిన పంత్‌పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. టెస్టుల్లో 2000 రన్స్ చేసిన యువ వికెట్ కీపర్ గా పంత్ రికార్డు సృష్టించాడు. జడ్డూ, పంత్ అటాకింగ్ తో టీమ్ఇండియా రేసులో నిలిచింది. వీరిద్దరి భాగస్వామ్యానికి అంతా ఫిదా అయ్యారు.