పెరిగిపోతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఏటా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి ఏడాది 2.3 మిలియన్లకు పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి. క్యాన్సర్ కారణంగా 2020లో 4.4 మిలియన్ల మంది మహిళలు మరణించారు. వారిలో పాతిక శాతం మంది రొమ్ము క్యాన్సర్ కారణంగానే మరణించారు. రొమ్ము క్యాన్సర్ చూపించే సంకేతాలను, లక్షణాలను గుర్తించడం కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. రొమ్మును నొక్కినప్పుడు గట్టిగా చేతికి గడ్డలా తగులుతూ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. రొమ్ము ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ మార్పు వచ్చినప్పుడు లేదా రొమ్ము చర్మంపై రంగు మారినప్పుడు అది రొమ్ము క్యాన్సర్ లక్షణంగా భావించాలి. రొమ్ములపై ఉండే చనుమొనలు రంగు మారినప్పుడు, వాటి చుట్టు ఉన్న చర్మం లో మార్పులు వచ్చినప్పుడు, వాటి నుంచి స్రావాలు వస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది.