ఈ పండు తింటే బరువు తగ్గుతారు డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతోంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల బరువు త్వరగా తగ్గొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్‌ను పిటాయా అని కూడా పిలుస్తారు. దీన్ని తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఈ పండ్లలో విటమిన్ ఇ, సి, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మన శరీరంలోని కణాలు నాశనం కాకుండా కాపాడతాయి. గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ తినడం చాలా అవసరం. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి తేమను అందించడం ముందుంటుంది డ్రాగన్ ఫ్రూట్.