వర్షాకాలంలో ఎక్కువగా దొరికే చిరుతిండి మొక్కజొన్న. మరి దీన్ని మధుమేహులు తినొచ్చా?



వీటిని ఉడికించుకుని తింటే మధుమేహులు కూడా ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు.



ఉడికించిన మొక్కజొన్న గ్లైసిమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. ఇది మనం తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.



మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ని కలిగి ఉంటాయి.
అందుకే ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సుమారు 10 గ్రాములు తింటే చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి.



మొక్కజొన్న డైటరీ ఫైబర్ మంచి మూలం.



మొక్కజొన్న గింజలు ప్రాసెస్ చేయని రూపంలో ఎంచుకోవడం ఉత్తమం.



డయాబెటిస్ ఉన్న వారు కూడా స్వీట్ కార్న్ తినవచ్చు. అయితే మితంగానే తినాలి.