ఆహారాన్ని వేగంగా తింటే బరువు పెరిగిపోతారు, జాగ్రత్త



ప్రపంచంలో పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలలో ఊబకాయం ఒకటి. దీని కారణంగానే అనేక అనారోగ్యాలు మనిషి పై దాడి చేస్తున్నాయి.



కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా అధిక బరువు బారిన పడే అవకాశం ఉంది.



జంక్ ఫుడ్ అధికంగా తినడం, వేళా పాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాలను తినడం, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా బరువు పెరిగేందుకు సహకరిస్తాయి.



ఆహారాన్ని అతివేగంగా తినేవారు కూడా త్వరగా బరువు పెరిగిపోతారని చెబుతోంది ఒక అధ్యయనం.



వేగంగా తినడం వల్ల ఎంత తింటున్నారో కూడా తెలియకుండా ఎక్కువ తినే అవకాశం ఉంది.



ఇలా మూడు పూటలా వేగంగా తింటే అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారం శరీరంలో చేరుతుంది. అది కొవ్వు రూపంలో పేరుకుపోయి బరువు పెరగడానికి కారణం అవుతుంది.



మనం ఆహారాన్ని తింటున్నప్పుడు ఆహారం మనకు సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి మెదడుకు కొంత సమయం పడుతుంది.



మెదడుకు ఆ సమయం దొరకాలంటే మెల్లగా నమిలి తినాలి. వేగంగా తింటే మెదడు గుర్తించలేదు.