డయాబెటిస్ ఉందా? కొత్తిమీర తినండి అన్ని కాలాలలో కొత్తిమీర అందుబాటులో ఉంటుంది. ప్రతికూరలోనూ కొత్తిమీరను కలుపుకోవచ్చు. రుచి కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా కొత్తిమీరను ప్రతిరోజూ తినాలి. రుచి కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా కొత్తిమీరను ప్రతిరోజూ తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకొని డయాబెటిస్ రోగాన్ని అదుపులో ఉంచుతుంది. కొత్తిమీర, ధనియాలు రెండింటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కొత్తిమీరలో కాల్షియం, పొటాషియం, విటమిన్ కే వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకుంటుంది. కిడ్నీలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా కొత్తిమీరని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.