వారానికోసారి బ్లాక్ రైస్ తింటే...



ఆరోగ్యకరమైన బియ్యం రకాల్లో నల్ల బియ్యం కూడా ఒకటి. చూడడానికి నల్లగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడరు.



వీటిని వారానికి ఒక్కసారి అయినా తినాల్సిన అవసరం ఉంది. ఈ బియ్యం లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.



రంగును చూసి తినడం మానేస్తే ఎన్నో పోషకాలను నష్టపోతారు. కాబట్టి కచ్చితంగా బ్లాక్ రైస్‌తో రోజుకు ఒక్కసారైనా భోజనం తినేందుకు ప్రయత్నించండి.



నల్ల బియ్యాన్ని తెచ్చుకుంటే మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ బియ్యాన్ని తినడం వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు.



ఈ బియ్యం తినడం వల్ల బరువు కూడా పెరగరు. ఎందుకంటే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.



ఈ గింజలోపల ఉండే గ్లూకోజ్ ను శరీరం శోషించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగవు.



ఆంథోసైనిన్స్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్ లో దీనిలో అధిక స్థాయిలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ మెదుడు పనితీరుకు చాలా ముఖ్యం.



సాధారణ వైట్ రైస్ తో ఎలాంటి వంటకాలు చేసుకోవచ్చ్... బ్లాక్ రైస్ తో కూడా అవన్నీ వండుకోవచ్చు.