ఇలా చేస్తే పెదాలు గులాబీ రేకుల్లా మారిపోతాయి



పెదాలు ఎంత అందంగా ఉంటే ముఖం అంత అందంగా కనిపిస్తుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పెదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.



నిమ్మరసంలో పంచదార, కొబ్బరి నూనె కలిపి పెదాలపై మర్ధనా చేయాలి. ఇలా చేస్తే నలుపుదనం తగ్గుతుంది.



గులాబీ రేకులను పేస్టులా చేసి అందులో తేనె కలిపి పెదాలకు రాయాలి. దీనితో పావుగంట సేపు మర్ధనా చేయాలి.



బొప్పాయి పండును మెత్తగా చేసి పెదాలపై రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాల నలుపు తగ్గుతుంవది.



గంధం, పసుపు కలిపి పెదాలకు రాయడం వల్ల తాజాగా కనిపిస్తాయి.



స్ట్రాబెర్రీ జ్యూస్‌ను తరచూ పెదాలకు రాయడం వల్ల అవి ఎరుపుగా మారుతాయి.



పాలమీగడను రాత్రి పూట పెదాలకు రాసుకుని పడుకుంటే ఉదయానికి అవి తాజాగా కనిపిస్తాయి.



ఈ చిట్కాలన్నీ పాటిస్తే పెదాలు పగలడం వంటి సమస్యలు తగ్గుతాయి.