వాట్సాప్‌లో కొన్ని పనులు చేస్తే అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.

కొత్త నంబర్లకు మెసేజ్ చేసినా, అనుమతి లేకుండా కాంటాక్ట్ షేర్ చేసినా అకౌంట్ బ్యాన్ అవ్వచ్చు.

వేరే వారి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయకూడదు.

బల్క్ మెసేజ్, ఆటో మెసేజ్, వాట్సాప్‌లో ఆటో డయల్ వంటివి ఉపయోగించకూడదు.

అన్ఆథరైజ్డ్ లేదా ఆటోమేటెడ్ ద్వారా వాట్సాప్ ఖాతాలు క్రియేట్ చేయకూడదు.

మీరు బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లు ఎక్కువ ఉపయోగిస్తున్నారని ఎవరైనా రిపోర్ట్ చేస్తే అకౌంట్ బ్యాన్ అవ్వచ్చు.

జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్ వంటి థర్డ్ పార్టీ వాట్సాప్ యాప్స్ ఉపయోగించకూడదు.

వైరస్, మాల్‌వేర్ ఉన్న ఫైల్స్ షేర్ చేయకూడదు.

ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఉపయోగించకూడదు.

కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా మీ వాట్సాప్ అకౌంట్‌ను కాపాడుకోండి.