మనదేశంలో 5జీ సేవలు వేగంగా పెరుగుతున్నాయి.

2023 నాటికి దేశం మొత్తం 5జీ కవరేజీ రానుంది.

5జీ మొబైల్స్ కూడా వేగంగా అమ్ముడు అవుతున్నాయి.

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి మొదటి ఛాయిస్ 5జీ ఫోన్లే కానున్నాయి.

5జీకి ప్రజలు వేగంగా అడాప్ట్ అవుతున్నారు.

2028 చివరి నాటికి దేశంలో 57 శాతం మంది మాత్రమే 5జీకి అప్‌గ్రేడ్ అవుతారని అంచనా.

ఈ విషయాన్ని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది.

మనదేశంలో 5జీ సర్వీసులు 2022 అక్టోబర్‌లో లాంచ్ అయ్యాయి.

డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారీ నెట్‌వర్క్ డిప్లాయ్‌మెంట్ జరుగుతుంది.

2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉంటారని అంచనా.