ఎత్తుగా ఉంటే ఈ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువట



అందం, ఎత్తు... ఈ రెండూ ఇప్పుడు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పొట్టిగా ఉన్న యువత ఆత్మన్యూనతతో బాధపడుతున్నారు.



నిజానికి ఎత్తు అధికంగా ఉండడం కూడా అంత మంచిదేమీ కాదు.



ఒక మనిషి ఎత్తు వారికి వచ్చే వ్యాధులకు మధ్య సంబంధాన్ని కనుక్కునేందుకు ఎన్నో అధ్యయనాలు జరిగాయి.



దానిలో ఎత్తు ఎక్కువగా ఉండే వ్యక్తులకు కొన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ అని తేలింది.



పొడవుగా ఉన్న వారిలో గుండె జబ్బులు త్వరగా వస్తాయి. అలాగే అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.



ఎత్తు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి జబ్బులు బారిన పడడానికి కారణం ఏంటో మాత్రం పరిశోధనలు చెప్పలేకపోతున్నాయి.



ఆ వ్యక్తి ఎత్తు వారసత్వం అంటే జన్యుపరంగా వచ్చేది కాబట్టి, జన్యు విశ్లేషణను చేసి శోధించాల్సి ఉంటుంది.



హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి. కాళ్లు, చేతుల్లో నాడులు త్వరగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.