కలబంద గుజ్జు రాత్రి ముఖానికి రాసుకుంటే...



కలబంద గుజ్జును రాత్రి పూట ముఖానికి రాసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.



కలబంద గుజ్జు సహజంగానే మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. దీన్ని రాసుకుంటే చర్మం తేమవంతంగా ఉంటుంది.



రాత్రిపూట ముఖానికి జెల్ రాసుకుంటే ముడతలు, గీతలు రాకుండా అడ్డుకుంటాయి.



కలబంద గుజ్జుకు కూలింగ్ గుణాలు ఎక్కువ. చర్మం సున్నితంగా మారుతుంది.



చర్మం మంటగా, దురదగా అనిపిస్తున్నప్పుడు కలబంద గుజ్జును పూస్తే ఆ సమస్య తగ్గుతుంది.



ఈ గుజ్జును రాస్తూ ఉంటే మొటిమలు రాకుండా ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఎక్కువ.



అలోవెరా జెల్ ప్రతి రోజూ రాయాల్సిన అవసరం లేదు. మూడు రోజులకోసారి రాసుకుంటే చాలు.



ప్రతి ఇంట్లో కలబంధ మొక్కలను పెంచుకుంటే మంచిది.