తల్లిదండ్రులు మద్యం తాగితే పిల్లలకు ఆ అలవాటు



చిన్నపిల్లలు తల్లిదండ్రులను చూసే మాట్లాడడానికి నడవడం, తినడం అన్నీ నేర్చుకుంటారు.



పెద్దలు తినే ఆహారాలను, పానీయాలను తాము తాగడానికి ఆసక్తి చూపిస్తారు.



తల్లిదండ్రులు ఎవరైతే మద్యానికి బానిసలు అవుతారో, అలాంటి వారి పిల్లలు కూడా మద్యం తాగే అవకాశాలు అధికంగా ఉన్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది.



తల్లిదండ్రులు మద్యం తాగే అలవాటు ఉంటే అలాంటి వారి పిల్లల ఆహారపు అలవాట్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.



తల్లిదండ్రులు నిత్యం తాగుడులో మునిగి తేలుతూ ఉంటే... వారిని చూసి పిల్లలు కూడా చెడుదారిలోనే వెళతారని అధ్యయనం చెబుతుంది.



ఇలాంటి పిల్లలు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినేందుకు బానిసలు అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.



కాబట్టి పిల్లల జీవితం ఎలా ఉండాలి అన్నది తల్లిదండ్రులే నిర్ణయిస్తారు.



పిల్లల ముందు మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు చేసే పనులే వారి భవిష్యత్తును ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.