చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యానికి హాని చేస్తుంది.



గుండె జబ్బులు, కొవ్వు కాలేయ వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని కలిగిస్తుంది.
అందుకే దాన్ని కరిగించుకునేందుకు ఇవి తినండి.


ప్రతిరోజూ కనీసం 25 గ్రాముల సోయాని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5-6 శాతం తగ్గిస్తుంది.



ఆరెంజ్ జ్యూస్ లో స్టెరాల్స్, స్టానాల్స్ నిండి ఉన్నాయి. కొలెస్ట్రాల్ ని 10 శాతం గ్రహిస్తాయి.



కనోలా, పొద్దుతిరుగుడు నూనె వంటి నూనెలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తాయి.



తృణధాన్యాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.



బీన్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొట్ట నిండుగా ఉంచుతుంది.



స్ట్రాబెర్రీలు పెక్టిన్ తో నిండి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.



బాదం, వాల్ నట్, వేరుశెనగ వంటి గింజలు గుండెకి మంచిది. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ 5 శాతం తగ్గిపోతుంది.