అలోవెరాతో జుట్టు పెరగడం ఖాయం



జుట్టుకు, చర్మానికి సంబంధించిన ఎన్నో కాస్మెటిక్స్‌లో అలోవెరా జెల్ వినియోగిస్తారు.



వర్షంలో తడవడం వల్ల చుండ్రు వాసన రావడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి.



వీటన్నిటి నుంచి మీ వెంట్రుకలను కాపాడుకోవాలని అనుకుంటే అలోవెరా జెల్‌తో ఇలా చేయండి.



తలస్నానం చేసిన తర్వాత కలబంద మొక్క ఆకులోని జెల్‌ను సేకరించి దాన్ని మాడుకు, వెంట్రుకలకు పట్టించండి.



దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. చుండ్రును తగ్గిస్తాయి. వెంట్రుకలు బలంగా ఎదిగేలా చేస్తాయి.



అలోవెరా జెల్ జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ చేస్తుంది. దీన్ని వాడడం వల్ల జుట్టు నలుపుగా, మెరుపుతో ఎదుగుతుంది.



కలబంద గుజ్జులో ప్రోటీలిటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మాడుపై దెబ్బతిన్న కణాలను నయం చేస్తాయి. దీనివల్ల జుట్టు వేగంగా ఎదుగుతుంది.



ఒక గిన్నెలో కలబంద గుజ్జు, ఆముదం, మెంతుల పొడి వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి.



ఐదారు గంటలు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణ గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి.