గర్భనిరోధక మాత్రలతో బీపీ వస్తుందా?



గర్భనిరోధక మాత్రలు వాడడం బీపీ వస్తుందేమో అన్న సందేహం ఎక్కువ మందిలో ఉంది.



హైబీపీ లేనివారు వీటిని వాడితే బీపీపై ఎలాంటి ప్రభావం పెద్దగా పడదు.



కానీ హైబీపీతో బాధపడుతున్న వారు మాత్రం గర్భనిరోధక మాత్రలను చాలా జాగ్రత్తగా వాడాలి.



వీటిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అధికంగా ఉన్న మాత్రలు ఉంటాయి.



ఈస్ట్రొజెన్ అధికంగా ఉన్న మాత్రలను వాడడం వల్ల కొందరిలో హైబీపీ పెరిగే అవకాశం ఉంది.



అయినా గర్బనిరోధక మాత్రలు తరచూ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు.



గర్భం రాకుండా ఉండేందుకు ఇతర పద్ధతులను పాటించడం ఉత్తమం.



ఈ పిల్స్ ని వాడడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.