ఐస్ ఫేషియల్ ఒక్క అందానికి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని ఇస్తుంది. ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కాపాడుతుంది.

ఆవిరయ్యే నత్రజని చర్మాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రయోథెరపీ చికిత్స అంటారు.

ఈ టెక్నిక్ ని జపాన్ లో 1978 లో రుమటాలజిస్ట్ డాక్టర్ తోషిమా యమగుచి అభివృద్ధి చేశారు. ఇది ప్రధానంగా రుమాటిక్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగిస్తారు.

కానీ ఇది ఇప్పుడు చర్మాన్ని పునరుద్దరించడానికి వినియోగిస్తున్నారు. మైగ్రేన్ నొప్పి, చర్మ వ్యాధుల చికిత్సకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

క్రయోథెరపీ ముఖం, తల, చర్మం, మెడపై మాత్రమే కాకుండా కొన్ని సార్లు ఇతర శరీర భాగాల్లో కూడా చేస్తారు. నొప్పులను తగ్గిస్తుంది.

చికాకు, మొటిమల వాపు, ఎరుపుని తగ్గించడంలో సహాయపడుతుంది. దెబ్బల వల్ల వచ్చే వాపుని తగ్గిస్తుంది.

శరీరంలో ఇన్ఫ్లమేషన్, మంటను తగ్గించడానికి ఐసింగ్ అవసరం. ఇందులోని ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గుణాల వల్ల చర్మాన్ని శాంతపరుస్తుంది.

క్రయోథెరపీ మృతకణాలని ఎక్స్ ఫోలియేట్ చేసి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చర్మానికి రంగుని అందిస్తుంది.

మైగ్రేన్, ఆర్థరైటిస్ నొప్పి లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక రుగ్మతలకు చికిత్స చేస్తుంది.

అల్జీమర్స్ వ్యాధి, డీమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.
Images Credit: Pexels