గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గన్ పార్క్ వద్ద సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత తీవ్రమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత (మే 4 నుండి) సిలిండర్ బరువును 12 కిలోల నుండి 10 కిలోలకు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

తన ఇంట్లో కూడా గ్యాస్ దొరకడం కష్టమని భార్య అడుగుతోందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

పెట్రోలియం శాఖ కేంద్రం పరిధిలో ఉందని సాకులు చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

గ్యాస్ కొరత అంశంపై శాసనసభ, మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబడతామని, ప్రజల తరపున గొంతు వినిపిస్తామని కేటీఆర్ అన్నారు

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

ఇరాన్‌లో ఇబ్బందులు ఉంటే ఇతర దేశాల నుండి గ్యాస్ తెప్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతుంటే, సప్లై లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam

దేశవ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని కేటీఆర్ విమర్శించారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam