హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం, చెరువుల్లా మారిన రోడ్లు Watch Videos

హైదరాబాద్‌ సిటీలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవగా రోడ్లపై నీరు నిలుస్తోంది

ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది, నిమిషాల వ్యవధిలో వర్షం దంచికొట్టింది

సికింద్రాబాద్ బేగంపేట్, రాణిగంజ్, కూకట్ పల్లి, నిజాంపేట్, అమీర్ పేట, పంజాగుట్టలో భారీ వర్షం కురిసింది

సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అధికారులు

హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది

రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయి, వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు

హైదరాబాద్ వాసులు అత్యవసరం అయితే తప్పా, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు