పళ్లు పచ్చగా మారుతున్నాయా? ఇలా చేస్తే మిలమిల మెరుస్తాయి!

చక్కగా నవ్వితే ముఖం అందంగా కనిపిస్తుంది.

నవ్వగానే పళ్లు తెల్లగా మెరిస్తే మరింత అందంగా అనిపిస్తుంది.

కానీ, కొంత మంది పళ్లు పచ్చగా మారి దుర్వాసన వస్తాయి.

వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే దంతాలు మిలమిల మెరిసేలా చేసుకోవచ్చు.

నిమ్మ చెక్కతో రోజూ పళ్లపై రుద్దడం వల్ల తెల్లగా మారే అవకాశం ఉంటుంది.

తులసి, ఆరెంజ్ తొక్కల పొడిని పేస్టుగా చేసి పళ్లకు పూస్తే కొద్ది రోజుల్లో అందంగా మారుతాయి.

పడుకునే ముందు బేకింగ్ సోడా పేస్టును పళ్లకు రాస్తే పసుపు మచ్చలు పోతాయి.

ఉప్పు, నిమ్మరసం కలిపిన పేస్టు దందాలకు పట్టించినా తెల్లగా తయారవుతాయి.

Photos Credit: pexels.com