ఈ మధ్య సెలబ్రిటి సర్కిల్ లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బాగా ట్రెండ్ లో ఉంది.

ఈ సంప్రదాయేతర కాఫీ మిశ్రమాన్ని అధిక నాణ్యత కలిగిన కొవ్వులతో కలిపి క్రీమీగా ఉండే కాఫీగా తయారు చేస్తారు.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మామూలు కాఫీ కాదు. మంచి నాణ్యత కలిగిన కాఫీ గింజలను ఉపయోగించి కాఫీ డికాక్షన్ తయారు చేస్తారు.

ఈ డికాక్షన్ కు వెన్న, మీడియం చైన్ ట్రైగ్లిజరాయిడ్ ఆయిల్ కలిపి రిచ్, క్రీమీ కాఫీ తయారు చేస్తారు.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తయారికి ప్రధానంగా గ్రాస్ ఫెడ్ బట్టర్ వాడుతారు. ఇందులో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది.

ఈ వెన్నతో కాఫీ ప్రత్యేకమైన రుచి, స్వరూపం వస్తుంది. అంతేకాదు పోషకాలు కూడా చేరుతాయట.

కొబ్బరి నూనె నుంచి తీసిన MCT ఆయిల్ తక్షణ శక్తిని అందిస్తుంది.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో ఈ ఆయిల్ చేర్చడం వల్ల శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో కాఫీ డికాక్షన్ కు 1-2 స్పూన్ల గ్రాస్ ఫెడ్ బట్టర్, MCT ఆయిల్ చేర్చి బ్లెండ్ చేస్తారు.

ఇలా బ్లెండ్ చేసినపుడు క్రీమీ టెక్చర్ కలిగి నురగలు కక్కే రుచికరమైన సువాసన కలిగిన కాఫీ తయారవుతుంది.

ఈ కాఫీ రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మానసిక, శారీరక సామర్థ్యం పెరుగుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels