అన్ని అవయవాల్లాగే మెదడుకు కూడా ప్రత్యేక పోషణ అవసరం. కొన్ని తింటే మెదడు పనితీరు మందగిస్తుందట.

ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగి మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల మెదడు పనితీరు మందగిస్తుందట.

ఆర్టిఫిషియల్ స్వీటనర్లు వాడే అలవాటుంటుంది చాలామందికి. వీటి ప్రభావం దీర్ఘ కాలంలో మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుందట

ప్రాసెస్ చేసిన ఆహారంలో ప్రిజర్వేటివ్స్, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటి ప్రభావం ఒక్కొకరి మీద ఒక్కో విధంగా ఉంటుంది.

ఆల్కహాల్ మెదడు ఆకృతి, పనితీరు అన్నింటి మీద ప్రభావం చూపుతుంది. రకరకా అభీజ్ఞసమస్యలకు ఆల్కహాల్ కారణం కావచ్చు.

సోడా, అదనపు చక్కెరలు కలిగిన పానీయాల వల్ల క్రమంగా మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.

వేపుళ్లలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. వీటి నుంచి వండే సమయంలో హానికారక ఫ్రీరాడికల్స్ విడుదలవుతాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకుంటే క్రమంగా మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. దీని వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels