చికెన్ పకోడి చేయడం ఎంత సులువో

ఒక గిన్నెలో చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలపాలి.



రెండు స్పూనుల పెరుగు కూడా వేసి బాగా కలపాలి.



ఆ మిశ్రమంలో గుడ్డు కొట్టి వేసి బాగా గిలక్కొట్టాలి.



నీళ్లు కలపవద్దు. నీళ్లు కలిపితే మిశ్రమం గట్టిగా రాకుండా జారిపోయేలా అవుతుంది.



ఇప్పుడు నిలువుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం కూడా బాగా కలిపాలి.



మిశ్రమంలోని ఫ్లేవర్లన్నీ ముక్కకు బాగా పట్టాలంటే గిన్నెపై మూత పెట్టి ఒక ఇరవై నిముషాలు ఫ్రిజ్ లో పెట్టండి. చక్కగా మారినేట్ అవుతుంది.



ఈలోపు స్టవ్ వెలిగింది కాస్త లోతుగా ఉండే చిన్న బాణలి పెట్టుకుని నూనె వేసి వేడి చేయాలి.



లోతుగా ఉండే చిన్న బాణలి పెట్టుకుంటే తక్కువ నూనెతో వేపుడు పూర్తవుతుంది. లేకుంటే ఎక్కువ నూనె వేయాలి.



నూనె వేడెక్కాక చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి.



ముక్కలు ఎర్రగా వేగాక తీసి గిన్నెలో వేసి కొత్తిమీర చల్లుకోవాలి.