మీరు కిచెన్ లో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తేనే మీ ఇల్లు అగ్నిప్రమాదాలకు తావు లేని సేఫ్ జోన్ కిందకి వస్తుంది.
వంటగదిలో పని ముగించుకుని బయటికి వచ్చే ముందు స్టవ్ తో పాటూ అన్ని ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ ఆఫ్ చేసి ఉన్నాయో లేవో చూసుకోండి.
మీకు ఆరోగ్యం బాగా లేనప్పుడు అంటే నీరసంగా, మగతగా ఉన్నప్పుడు వంట జోలికి పోకండి. ఆ మగతలో చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించలేరు. దీని వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
వంట చేసేటప్పుడు మీరు వేసుకునే దుస్తులు సరిగా ఉండాలి. వదులుగా, వేలాడుతూ ఉండేవి, సిల్క్ చీరలు వంటివి వద్దు.
చాలా మంది వంట చేసేటప్పుడు వేడి గిన్నెలు దించడానికి చిన్న టవల్స్ వంటివి వాడతారు. అలాగే చీర కొంగులతో దించేయడం, చున్నీలు వాడడం చేస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు.
అగ్గిపెట్టెలు వాడడం మానేయండి. అగ్గిపుల్లలు ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి.
టోస్టర్లు, రైస్ కుక్కర్లు వాడేశాక ప్లగ్ లు తీసి పక్కన పెట్టేయాలి. అక్కడ మంట అంటుకునే వస్తువులేవీ లేకుండా చూసుకోవాలి.
ఓవెన్ వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మైక్రోఓవెన్లో మెటల్ వస్తువులు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.