ప్రియాంక జవాల్కర్.. ‘ట్యాక్సీవాలా’తో హాయ్ చెప్పిన క్యూటీకి ఇప్పుడు ఛాన్సులు లేవు. ‘SR కళ్యాణమండపం’ తర్వాత ప్రియాంకకు మళ్లీ అవకాశాలు చిక్కలేదు. సినిమాలో ఛాన్సుల కోసం ప్రియాంక బరువు కూడా తగ్గింది. అందాలతో ఆకట్టుకుంటున్నా.. ఎందుకో లక్ కలిసి రావడం లేదు. అయితే, ఆమె మరో మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు టాక్. కానీ, అప్‌డేట్స్ లేవు. ఇటీవల ఓ క్రికేటర్‌తో ప్రేమాయణమంటూ ప్రియాంక వార్తల్లోకి ఎక్కింది. ఆ వార్తతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. ప్రియాంక అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ప్రియాంక రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది. Image Credit: Priyanka Jawalkar/Instagram