ఆల్మండ్ మిల్క్‌ (బాదాం పాలు)ను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు.

దీనిని తయారు చేసుకోవడానికి కేవలం 3 పదార్ధాలు ఉంటే సరిపోతుంది.

1 కప్పు బాదం, 2 కప్పుల నీళ్ళు, తీపి కోసం తేనె.

మొదట బాదంలను నీళ్ళలో 12 గంటలు నానపెట్టండి.

నానబెట్టిన బాదంపప్పులను తీసి శుభ్రం చేయండి.

బాదంలను 2 కప్పుల నీళ్ళతో కలిపి గ్రైండర్ లో రుబ్బండి.

గుడ్డ ముక్కను ఉపయోగించి రుబ్బిన బాదం మిశ్రమాన్ని వడకట్టండి.

మీ టేస్ట్ కి తగినంత తేనె మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టండి.

Image Source: pexels

ఈ ఆల్మండ్ మిల్క్ ని మీరు కాఫీ లేదా ధాన్యాలతో మిక్స్ చేసుకొని తాగచ్చు.