తగినంత బరువు లేకపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక తగినంత శరీర బరువు పెరిగేందుకు ఏం చెయ్యాలో చూద్దాం.

బీఎంఐ 18.5 కంటే తక్కువగా ఉంటే త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఫెర్టిలిటీ సమస్యలు కూడా రావచ్చు.

బీఎంఐ తక్కువగా ఉన్న వారు కండరాల సాంద్రత, సబ్ క్యూటేనియస్ ఫ్యాట్ పెంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.

ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం. రోజుకు 300-500 క్యాలరీలు అదనంగా తీసుకోవాలి.

ప్రొటీన్ కణనిర్మాణానికి అవసరం. ఎక్కువ ప్రొటీన్ కలిగిన ఆహారం మాంసం, చేపలు, గుడ్డు, చిక్కుళ్లు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.

బరువు పెరిగేందుకైనా, తగ్గేందుకైనా వ్యాయామం తప్పనిసరి.

అదనంగా కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్ కలిగిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి.

అవకాడో, నట్స్ వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవాలి.

రోజుకు కనీసం మూడు సార్లు భోంచెయ్యాలి. శక్తినిచ్చే స్నాక్స్ ఎంచుకోవాలి.

ప్రతి రోజూ ఒకగ్లాస్ ఫుల్ ఫ్యాట్ పాలు తాగాలి.

తగినంత నిద్ర కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇది కండర వృద్ధికి అవసరం.
Images courtesy : Pexels