పొడవైన జుట్టు కోసం ఏ పోషకాహారం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

సాల్మన్ చేపలో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. సాల్మన్ చేప పొడవైన జుట్టు పెరిగేందుకు మంచి ఆహారం.

బెర్రీల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి జుట్టు రాలడం అరికట్టి, ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.

గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కనుక జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు ఎ,సి ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యానికి అవసరం.

చిలగడ దుంపల్లో విటమిన్ ఎ ఎక్కువ. ఇది జుట్ట పెరిగేందుకు అవసరం.

బాదాములు, వాల్నట్స్, అవిసె గింజల్లో జింక్, ఒమెగా3 వంటి పోషకాలుంటాయి. వీటి వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

అవకాడోలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్ ఇ వల్ల స్కాల్ప్ లో తేమ నిలిచి ఉంటుంది.

గ్రీక్ యోగర్ట్ లో విటమిన్ బి5 ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
Images courtesy : Pexels