పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పుదీనాను ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా ఆకులు వేసిన మజ్జిగ తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుంది. పుదీనాలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. కళ్లను ఆరోగ్యం కాపాడుతుంది. పుదీనాతో జీర్ణశక్తి మరింత పెరుగుతుంది. అజీర్తి, గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయాన్నే పుదీనా ఆకులు వేసి కాగబెట్టిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు మరింత చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పుదీనా ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. All Photos Credit: Pixabay.com