అరటి పండును ఎటువైపు నుంచి ఒలవాలి? ఎలాంటి పండు తినాలి?

అరటి పండు ఆరోగ్యానికి చాలామంచిది. చాలామందికి ఇది ఫేవరెట్ కూడా.

అయితే, దీన్ని ఎటు పక్క నుంచి వలిచి తినాలనే సందేహం చాలామందిలో ఉంటుంది.

అరటి పండును ఎలా వలిచి తిన్నా పర్వాలేదు. రెండు వైపుల నుంచి తొక్క తీయొచ్చు.

అయితే, అరటి పండులో కాండం (తొడిమ భాగం) ఎక్కువ మెత్తగా ఉంటుంది.

తొడిమ వైపు త్వరగా పండుతుంది కాబట్టి.. అటు నుంచి ఒలిచి తినడమే ఉత్తమ పద్ధతి.

బాగా ముగ్గిన అరటి పండు తినకూడదు. అందులో చక్కెర స్థాయిలు ఎక్కువ.

అలాగే, బాగా పచ్చిగా ఉండే అరటి పండు కూడా తినకూడదు. కడుపు నొప్పి వస్తుంది.

కేవలం పసుపు పచ్చగా, చిన్న చిన్న మచ్చలతో పండిన అరటి పండే తినాలి.

Image Credit: Pixabay and Pexels