తాజా రొయ్యలను కొనాలా? ఇదిగో ఇలా గుర్తించండి

రొయ్యలు కొనడానికి వెళ్తున్నారా? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.

మీరు కొనే రొయ్యలు తాజావో కాదో తెలుసుకోవాలంటే ముందుగా వాటి తలను పరిశీలించండి.

రొయ్య తల శుభ్రంగా, గట్టిగా ఉన్నట్లయితే అది తాజాగా ఉందని అర్థం.

అలాగే రొయ్య పెంకు, శరీరం కూడా గట్టిగా ఉంటే తాజాగా ఉన్నట్లే.

ఒక వేళ రొయ్యలు మృదువుగా, వాటి కాళ్లు వదులుగా, శరీరం మెత్తగా ఉంటే నిలువ రొయ్యాలని అర్థం.

అలాగే రొయ్యల నుంచి ఘాటైన దుర్వాసన వస్తున్నట్లయితే కొనకపోవడమే ఉత్తమం.

ఎప్పుడూ పొట్టు తీసేసిన రొయ్యలు కొనవద్దు. అలాంటివి ఆరోగ్యానికే ప్రమాదకరం.

Image Credit: Pexels