టెస్టోస్టిరాన్.. లైంగిక హార్మోన్. సంతాన సాఫల్యానికి, సామర్థ్యానికి ఇదే మూలం. శరీరంలో పురుష లక్షణాలకు, మానసిక స్థితి నియంత్రణకు, లిబిడోను పెంపొందించడంలోనూ ఇది అవసరం. టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి నాణ్యమైన నిద్ర అవసరం. వ్యాయామం టెస్టోస్టిరాన్ స్థాయిల మీద ప్రభావాన్ని చూపుతుంది. వ్యాయామం తర్వాత 15-30 నిమిషాల వ్యవధిలో T స్థాయిలు పెరుగుతాయి. బరువు ఎక్కువ లేదా తక్కువగా ఉన్న వారిలో టెస్టోస్టిరాన్ తగినంత ఉండకపోవచ్చు. కనుక తగినంత శారీక బరువు కలిగి ఉండాలి. తగినంత ఎండ తగిలితే సిర్కాడియన్ సైకిల్ నియంత్రణలో ఉండడమే కాదు టెస్టోస్టిరాన్ కూడా పెరుగుతుంది. తగినంత విటమిన్ డి లేకపోయినా టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. కనుక విటమిన్ డి తగినంత ఉండేలా జాగ్రత్త పడాలి. స్ట్రెస్ హార్మోన్ల వల్ల కూడా టెస్టోస్టిరాన్ తగ్గుతుంది. కనుక స్ట్రెస్ తగ్గించుకోవాలి. తగినంత ప్రొటీన్, ఫ్యాట్ కలిగిన పౌష్టికాహారం తీసుకోవడం కూడా టెస్టోస్టిరాన్ వృద్ధికి అవసరం. Representational Image : Pexels