జామపండు వీళ్లు తినకపోవడమే మంచిది



తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే జామపండు ఆరోగ్యానికి చాలా మంచిది



గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు జామ తీసుకుంటే ఉపశమనం ఉంటుంది



జామపండుతో పాటూ జామ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని ,రోగనిరోధక శక్తిని పెంచుతాయి



జామకాయలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉండటం వల్ల మోతాదుకి మించి తింటే కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది



మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామపండ్లు తినొచ్చు కానీ మోతాదుకి మించి తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది



జామపండును రాత్రిపూట తినకూడదు..ఎందుకంటే ఇది జలుబు- దగ్గుకు కారణమవుతుంది



ఇప్పటికే పంటి నొప్పితో బాధపడుతున్నట్లయితే జామ పండును తినకుండా ఉండడమే మంచిది



బాగా మగ్గిపోయిన జామపండును తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి, మరీ పచ్చిగా ఉండేవాటిని తింటే కడుపునొప్పి వస్తుంది



ఎక్కువగా గింజలు ఉన్న జామపండు తింటే అపెండిసైటిస్ వచ్చే ప్రమాదం ఉంది, దోరగా ఉండే జామపండు రోజుకొకటి చాలు
Images Credit: Freepik