రోజుకు ఎన్ని అరటి పండ్లు తింటే మంచిది? ఎక్కువ తింటే? పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక రోజులు మూడు నుంచి నాలుగు రకాల పండ్లు తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండును రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు లేదా వ్యాయామానికి ముందు తినొచ్చు. అరటి పండు కార్బోహైడ్రేట్స్‌ను అందిస్తుంది.డయాబెటిస్ ఉంటే మాత్రం పండును పూర్తిగా తినొద్దు. అరటి పండ్లను బాదం, పీనట్ బటర్‌తో కలిపి తింటే మంచి ఎనర్జీ వస్తుంది. రోజూ ఒక మీడియం సైజు అరటి పండు తినడమే ఉత్తమం అని వైద్యుల సూచన. అతిగా తింటే మాత్రం జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. Images Credit: Pexels