క్వినోవా తింటే ఎంత మంచిదంటే...



తెల్ల అన్నం కన్నా క్వినోవా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.



క్వినోవా ఇప్పుడు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. దీన్ని రెండు రోజులకోసారి తింటే బరువు తగ్గుతారు.



అధిక బరువుతో బాధపడే వారు క్వినోవా తింటే మంచిది. ఇది త్వరగా జీర్ణమవ్వదు.



ఇది అరగడానికి సమయం పడుతుంది. కాబట్టి త్వరగా ఆకలి వేయదు.



షుగర్ వ్యాధితో బాధపడేవారు క్వినోవా తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది.



ఇది తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.



క్వినోవా తినడం వల్ల నిద్రలేమి సమస్య చాలా తగ్గుతుంది.



ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి రాకుండా ఇది కాపాడుతుంది.