బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన దిశా.. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. 'ఎంఎస్ ధోని - అన్ టోల్డ్ స్టోరీ' 'కుంఫు యోగా' 'భారత్' 'భాగీ 2' 'మలంగ్' 'ఏక్ విలన్ రిటర్న్స్' వంటి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం 'యోధ' అనే హిందీ సినిమాలో నటిస్తున్న దిశా పటాని.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సౌత్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో దిశా పఠానీ కీలక పాత్ర పోషిస్తోంది. 'కంగువ' చిత్రంలో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది అమ్మడికి డెబ్యూ తమిళ్ మూవీ. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. హాట్ హాట్ అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తుంది. రెగ్యులర్ గా తన హాట్ వీడియోలు, బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ యువ హృదయాలను కొల్లగొడుతుంది దిశా.