అక్టోబరు 8 రాశిఫలాలు



మేషం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ మాటతీరు మార్చుకోవడం ద్వారా కుటుంబంలో ఉన్న చీలికకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక విషయాల్లో ఎవరి నుంచి సలహాలు తీసుకోవద్దు. ఉద్యోగులు అహంకారం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు.



వృషభం
ఈ రోజు వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మనసు గెలుచుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభించవచ్చు. కుటుంబంలో సీనియర్ సభ్యుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు.



మిథునం
ఈ రోజు మీకు శుభ ఫలితాలంటాయి. మీరు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన చర్చలో పాల్గొంటారు. పిల్లలు మీకు అనుగుణంగా ఉంటారు. మీరు గొప్పగా ఆలోచిస్తారు. వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులను సంప్రదించకుండా ఉండడం మంచిది.



కర్కాటకం
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాలు తీసుకోవడం మంచిది. కన్నవారు కొన్ని విషయాల్లో మిమ్మల్ని నిలదీస్తారు..మాట తూలొద్దు.



సింహం
ఈ రోజు మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మేలు జరుగుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో చేసిన ఏదైనా పొరపాటుకు మీ మనస్సులో భయపడతారు.



కన్య
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు కొందరు మిమ్మల్ని మోసం చేయడం మిమ్మల్నిచాలా బాధపెడుతుంది. పెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి.



తుల
ఏదైనా లావాదేవీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవలసి ఉంటుంది. అత్సుత్సాహంతో చేసే పనిని పాడుచేస్తారు...జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. మీబాధ్యతలను వేరేవారికి అప్పగించవద్దు.



వృశ్చికం
ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడొద్దు. ఏదైనా ప్రభుత్వ పనిలో మీరు దాని నియమాలను అనుసరించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్లో చురుకుదనం చూపుతూ ముందుకు సాగుతారు.



ధనుస్సు
మీరు ఈ రోజు శక్తివంతంగా ఉంటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. ఆదాయ వ్యయాన్ని సమతుల్యం చేసుకుంటే మీకు మంచిది. భౌతిక సౌకర్యాలపై ఆసక్తి చూపుతారు. దినచర్యలో భాగంగా యోగా వ్యాయామాన్ని అనుసరించాలి



మకరం
ఈ రోజు మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి. మీ తోబుట్టువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. స్నేహితుడి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా డీల్ ఆగిపోవచ్చు



కుంభం
ఈ రోజు కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ మాటతీరు వల్ల చర్చలు పెరుగుతాయి. ఇంటాబయటా మీకు గౌరవం పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.



మీనం
వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ పాత ప్రణాళికలలో కొన్నింటిని ముందుకు తీసుకువెళితే మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచిఫలితాలు పొందుతారు.