మేషం ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. స్నేహితులతో ఫోన్లో చర్చలుంటాయి. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి. పని ఒత్తిడి తక్కువ ఉండడంతో రోజంతా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి వ్యక్తులను కలుస్తారు.
వృషభం మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదం రావొచ్చు. సహోద్యోగులపై కోపంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. బాధ్యతను సకాలంలో నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తారు.
మిథునం అనవసర చర్చల్లో పాల్గొని సమయాన్ని వృథా చేసుకోకండి.కెరీర్ విషయంలో కొత్త ప్లాన్ వేసుకోండి. దంపతులు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త ఆఫర్లు లభిస్తాయి. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. మీరు ఇంట్లో ఆఫీసు పని చేయాల్సి రావొచ్చు.
కర్కాటకం నిలిచిపోయిన పనులను పూర్తి చేయలేరు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తప్పుడు చర్యలు నష్టానికి దారితీస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. దినచర్యను ఫాలో అవండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
సింహం కుటుంబ సభ్యులపై ఊరికే కోప్పడకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన చాలా సానుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.శుభ కార్యాల్లో పాల్గొంటారు.
కన్యా ఈ రాశికి చెందిన రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్నిసమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు.
తులా ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించండి. పిల్లలు సెలవులను ఆనందిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు. కెరీర్ విషయంలో కొంత టెన్షన్ ఉంటుంది. వైవాహిక సంబంధాలలో కొన్ని ఇబ్బందులుంటాయి.
వృశ్చికం ప్రయాణంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. వ్యాపార కార్యకలాపాలు సకాలంలో పూర్తి కావు. బంధువులతో వివాదాలుంటాయి. ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు.
ధనుస్సు ఈ రోజు ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. అవసరమైన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఖర్చు ఎక్కువ చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
మకరం కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ అభిప్రాయాలను ఎవ్వరిపైనా రుద్దకండి. స్నేహితులతో వాగ్వాదం జరుగుతుంది.
కుంభం వేసవిలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మంచి రోజు అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రహస్య శాస్త్రాల అధ్యయనం పట్ల ఆసక్తి ఉంటుంది.
మీనం అనవసరమైన పనికోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిచుకోండి.