శ్రద్ధా దాస్ అంటే అందానికి కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్‌లోకి ఓ మెరుపులా వచ్చి మాయమైంది శ్రద్ధా. తెలుగులో కొన్ని చిత్రాలకే పరిమితమైనా.. ఆమెను ప్రేక్షకులు మరిచిపోలేరు. ఈ గ్లామర్ డాల్ ప్రస్తుతం హిందీలో పలు వెబ్ సీరిస్‌లు చేస్తోంది. ఖాళీ దొరికిప్పుడు ఇలా చీర కట్టుతో కణికట్టు చేస్తుంది. బాపు బొమ్మను సైతం చిన్నబోయేలా చేసే రూపం శ్రద్ధా దాస్‌ది. ఈ అందాల ఆనకట్టుకు వరదొస్తే కుర్రాళ్ల గుండె కొల్లేరే. ఈమె ఏ ఫొటో పెట్టినా ‘శ్రద్ధ’గా చూస్తారు అభిమానులు. ‘ఏక్ మినీ కథ’లో సన్యాసినిలా మెస్మరైజ్ చేసింది శ్రద్ధ. అందుకే, మళ్లీ ఎప్పుడు కనపడతావ్ శ్రద్ధా అని అడుగుతున్నారు ఫ్యాన్స్. తాజాగా మరోసారి శారీతో సర్‌ప్రైజ్ ఇచ్చింది శ్రద్ధా. ఈ వీడియో చూస్తే శ్రద్ధా దాస్‌కు దాసోహమైపోవడం ఖాయం. ప్రస్తుతం శ్రద్ధా తెలుగులో ‘అర్ధం’ మూవీలో నటిస్తోంది. Images and Video Credit: Sradha Das/Instagram