ఏప్రిల్ 28 రాశిఫలాలు ఈ రాశివారు ఇబ్బందులు ఎదుర్కొంటారు
మేషం ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందుల్లో పడొచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు మారేందుకు తొందరపడకండి. ఇంటి పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మనసులో భయం ఉంటుంది.
వృషభం ఆర్థికంగా లాభపడతారు.కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. అనవసర వాదనల్లో సమయాన్ని వృధా చేసుకోకండి.
మిథునం మీ వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయవచ్చు. మీ లక్ష్యాలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. పరిశోధన పనిలో గొప్ప విజయం సాధిస్తారు.అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల నష్టపోతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
కర్కాటకం కొత్త ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉంటారు.జీవిత భాగస్వామి ప్రవర్తన నిరాశకు గురిచేస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించాలి. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
సింహం ఎక్కువ బాధ్యత కారణంగా అలసిపోతారు. వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. పాదాల నొప్పితో ఇబ్బంది పడతారు. మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు.
కన్యా పిల్లలకు ఉన్న సమస్య తొలగిపోతుంది. మీ పనిభారాన్ని ఇతరులతో పంచుకోండి. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.
తులా వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. కార్యాలయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. పాత మిత్రులను కలుస్తారు.
వృశ్చికం పెండింగ్‌లో ఉన్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. ప్రేమికులు షికార్లు చేస్తారు.బంధువుల వివాహానికి సంబంధించిన సమాచారం రావచ్చు.మీ రోజంతా ఆనందంగా ఉంటారు. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.
ధనుస్సు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. మీ అవసరాలను నియంత్రించండి.వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.
మకరం స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోండి.డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆఫీసులో చాలా క్రమశిక్షణతో ఉంటారు. పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పనులు సులువుగా జరుగుతాయి.
కుంభం కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. కార్యాలయ సమస్యలను పరిష్కరించండి.ఈ రోజు పని ఒత్తిడి చాలా ఉంటుంది. వేరేవారి పనిలో జోక్యం చేసుకోవద్దు.
మీనం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే మంచిసమయం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. ప్రమాదకర పనులు చేయవద్దు.