మేషం: ఈరోజు చర్చలకు దూరంగా ఉండండి. మీ సహోద్యోగులతో మంచి ప్రవర్తన కలిగి ఉండండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. వ్యాపార సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభం: ఈరోజు కుటుంబంతో సంతోష సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది.
మిథునం: కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు.విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు మీ నుంచి ఎక్కువ పనిని ఆశిస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం వద్దు. పాత పొదుపుల నుంచి ప్రయోజనంని పొందుతారు.
కర్కాటకం: కొత్త పనులపై ఆసక్తి చూపుతారు.ప్రేమికులు పెళ్లి విషయంలో తొందరపడటం మానుకోవాలి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. విద్యార్థులు చదువు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి.
సింహం: కుటుంబానికి సమయం కేటాయించండి. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఆఫీసులో సహోద్యోగితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
కన్య: ఉద్యోగావకాశాలు లభిస్తాయి.విహారయాత్రకు వెళ్తారు.తలపెట్టిన కొన్ని పనుల్లో సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం.స్నేహితుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి.
తుల: మీ ప్రవర్తనను నియంత్రించుకోండి. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతను పొందుతారు. ఎవరి నుంచీ ఎక్కువగా ఆశించవద్దు.
వృశ్చికం: పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు.
ధనుస్సు: అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.బరువులు ఎక్కువగా ఎత్తొద్దు.మీరు తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాలను సమతుల్యంగా ఉంచుకోండి.ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి.
మకరం: మీరు చాలా సానుకూలంగా ఆలోచిస్తారు. రిస్క్ తీసుకుంటూనే సక్సెస్ అవుతారు. ఎనర్జిటిక్ గా ఉంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం: మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. నిరుపేదలకు సహాయం చేయండి. మీకు తెలియకుండా మీ చుట్టూ కొన్ని కుట్రలు జరగొచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు.
మీనం: నిరుద్యోగులకు శుభసమయం. ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. పనికిరాని పనులు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి.