మేషం దశమంలో చంద్రుడు, పదకొండో స్థానంలో ఉని శని లాభాలను ఇస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగుల పనితీరు బావుంటుంది. ఈ రోజు మీకు తెలుపు, ఎరుపు రంగులు మంచివి.
వృషభం ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ మాటతీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. నీలం, తెలుపు మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు.
మిథునం ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని అయినా జాగ్రత్తగా తీసుకోండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదవుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు మీకు కలిసొచ్చే రంగులు.
కర్కాటకం ఈ రోజు విద్యార్థులకు విజయవంతమైన రోజు అవుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆకుపచ్చ, నారింజ రంగులు శుభప్రదం.
సింహం ఈ రోజు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు ఉన్నతమైన అవకాశాలు వస్తాయి.
కన్యా ఐదవ ఇంట ఉన్న చంద్రుడు శుభప్రదుడు. వ్యాపారంలో పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు. రాహుకేతు సంచారాలు మీకు ఒత్తిడి పెంచుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరెంజ్, గ్రీన్ మీకు కలిసొచ్చే రంగులు.
తుల విద్యారంగంలో పురోభివృద్ధి పట్ల సంతోషం ఉంటుంది. ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్నేహితులను కలుస్తారు. కుటుంబ వాతావరణం బావుంటుంది. ఆరెంజ్, గ్రీన్ రంగులు ఈ రోజు మీకు శుభప్రదం.
వృశ్చికం ఈ రోజు మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. వైలెట్, స్కై బ్లూ మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు.
ధనుస్సు ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఓ శుభవార్త వింటారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు తమ భవిష్యత్ విషయంలో ఆలోచనలో పడతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులకు బాగానే ఉంది. ఎరుపు, ఊదా రంగులు మీకు కలిసొస్తాయి.
కుంభం ఈ రాశి విద్యార్థులు విజయం సాధిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం, ఆనందం కోసం సుందరకాండ పారాయణం చేయండి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. వైలెట్ , గ్రీన్ రంగులు ఈ రోజు మీకు శుభప్రదం.
మీనం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము చేతికందుతుంది. వ్యాపార కార్యక్రమాల్లో రోజంతా బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో భాగస్వాములు కావడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు బాగానే ఉంది. పసుపు, తెలుపు మీకు కలిసొచ్చే రంగులు.