జలుబు, దగ్గు రావడం వల్ల చాలా నీరసించిపోతారు. ఇంట్లో దొరికే వాటితోనే వాటిని నయం చేసుకోవచ్చు.

హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి.

గొంతు నొప్పి తగ్గించుకోవడానికి గోరు వెచ్చని నీళ్ళు తాగడం వల్ల రిలీఫ్ వస్తుంది.

క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే నీరసం రాకుండా ఉంటుంది.

జ్వరంగా అనిపిస్తే ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తూ మందులు తీసుకోవాలి. తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి.

ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా నిద్ర పోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.

జలుబుకు దూరంగా ఉండాలంటే పసుపు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు వంటి మసాలా దినుసులను ఆహారంలో చేర్చుకోవాలి.



వేడి నీళ్ళల్లో పసుపు వేసుకుని ఆవిరి పట్టడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. ముక్కు కారడం కూడా తగ్గుతుంది.

పసుపు, నెయ్యి, పాలు కలుపుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

పోషకాలతో నిండిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.