ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెల్లారేవరకు పార్టీ చేసుకునే వాళ్లూ ఉంటారు కొందరు పార్టీ పేరుతో ఫుల్లుగా మద్యం సేవిస్తారు. ఉదయం లేచి హ్యాంగోవర్ అని తలపట్టుకుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే హ్యాంగోవర్ తగ్గుతుంది. ఈ టిప్స్ పాటిస్తే తలనొప్పి, వికారం నుంచి ఉపశమనం కలుగుతుంది. హ్యాంగోవర్ తగ్గడానికి ఎక్కువగా మంచి నీళ్లు, లేక కొబ్బరి బొండం లాంటివి తాగాలి. తలనొప్పి, నీరసం కాస్త తగ్గుతాయి నిమ్మరసం లాంటి సిట్రస్ పానియాలు తాగితే హ్యాంగోవర్‌ను వేగంగా కంట్రోల్ చేస్తాయి ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆల్కాహాల్ ప్రభావం తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. ఆకుకూరలు, పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పెరిగి.. కండరాల తిమ్మిరి, అలసట తగ్గుతాయి హ్యాంగోవర్ వల్ల వచ్చే కడుపునొప్పి, వికారానికి అల్లం చెక్ పెడుతుంది. అల్లం టీ తాగినా, లేక అల్లం ముక్క నీటిలో మరిగించి తాగితే రిలీఫ్ ఉంటుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం అందించడంలో పుదీనా బాగా పనిచేస్తుంది. పుదీనా జ్యూస్ లేక పుదీనా ఆకును నేరుగా తినొచ్చు అతి ఏదైనా మంచిది కాదు. ఆల్కాహాల్ కొద్దిగా సేవిస్తే హ్యాంగోవర్ లాంటి సమస్యలు రావు (All Photos Credit: Pixabay)