చలికాలంలో పొడి దగ్గు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పొడి దగ్గుకు చెక్ పెట్టవచ్చు. టేబుల్ స్పూన్ తేనెను రెగ్యూలర్‌గా తీసుకుంటే పొడి దగ్గు కంట్రోల్ అవుతుంది. వేడి పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే గొంతులో నొప్పి, పొడి దగ్గు తగ్గుతుంది. అల్లాన్ని నీటిలో మరిగించి.. తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిది. స్టీమ్ తీసుకుంటే గొంతు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా రిలాక్స్‌గా ఉంటుంది. నీళ్లలో సాల్ట్ కలిపి దానితో నోటిని పొక్కిలిస్తే ఈ సమస్య దూరమవుతుంది. పుదీనా టీ కూడా పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. (Image Source : Unsplash & Pinterest )