బేకింగ్ సోడా జుట్టుకి బాగా పని చేస్తుంది. దీన్ని తడి జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తర్వాత జుట్టుని నీటితో బాగా కడగాలి.



నిమ్మరసం, పెరుగు తలకి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకున్న తర్వాత దాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.



వేపాకుల చూర్ణం తలకి అప్లై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు దాన్ని ఆరబెట్టుకోవాలి. తర్వాత జుట్టుని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.



నీరు, ఆపిల్ సిడర్ వెనిగర్ సమపాళ్ళలో తీసుకోవాలి. జుట్టు కడిగిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత నీటితో కడుక్కోవాలి.



సాల్మన్, ట్యూనా వంటి చేపలు ఆరోగ్యకరమైనవి. ఈ చేపల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది.



గుడ్డులో జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ఫ్, జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.



ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, ఇతర విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.



స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు అందించే సహజ మూలం అవకాడో. ఇవి తినడం వల్ల జుట్టుకి మేలు జరుగుతుంది.



ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.



అరటి పండులో జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ఫ్ ని రక్షించడంలో, ఆరోగ్యకరమైన జుట్టుని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.