చలికాలంలో చర్మం పొడిగా మారి ఇబ్బంది పెడుతుంది.

కాళ్లల్లో కూడా పగుళ్లు ఏర్పడి చూసేందుకు అంత మంచిగా అనిపించవు.

అయితే వీటికి కొన్ని హోమ్ రెమిడీలతో చెక్ పెట్టవచ్చు.

పంచదారలో ఆలివ్ లేదా తేనెను కలిపి పాదాలకు సున్నితంగా మసాజ్ చేయాలి.

ఇది డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగించి పాదాలకు తేమను ఇస్తాయి.

రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్​తో పాదాలకు మసాజ్ చేయవచ్చు.

కలబంద పొడిబారడాన్ని దూరం చేస్తుంది. దీనిని డైరక్ట్​గా పాదాలకు అప్లై చేయొచ్చు.

అరటిపండు, తేనె కలిపి పాదాలకు మసాజ్ చేసిన మంచి ఫలితాలుంటాయి. (Images Source : Unsplash)