చీర కట్టులో డ్యాన్స్ అదరగొట్టిన హానీ రోజ్ - వీడియో వైరల్! 2005 లో 'బాయ్ ఫ్రెండ్' సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్. మలయాళం తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. 2008లో ముత్యాల సుబ్బయ్య 'ఆలయం' సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైంది. 'ఆలయం' తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది బాలయ్య 'వీరసింహారెడ్డి'లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తెలుగులో పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. చీరకట్టులో హనీ రోజ్ డాన్స్ వీడియో నెటజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి. Photo Credit : Honey Rose/Instagram