టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్‌ప్రీత్ సింగ్‌కు మళ్లీ ఈడీ సమన్లు అందించింది. గతేడాది సెప్టెంబర్ 23న రకుల్‌ను ఈడీ ఒకసారి విచారించింది. ఈ కేసును గత నాలుగు సంవత్సరాల నుంచి ఈడీ విచారిస్తూనే ఉంది. ఈ విషయమై పలువురు తెలుగు నటులను ఇప్పటికే విచారించారు. 2017లో ఈ డ్రగ్స్ కేసు మొదటగా వెలుగులోకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. తమిళనాట క్రేజీ ప్రాజెక్ట్ అయిన ‘ఇండియన్ 2’లో కూడా రకుల్ నటిస్తుంది. ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘డాక్టర్ జి’లో కూడా రకుల్ కనిపించింది. 2011లో వచ్చిన ‘కెరటం’ సినిమాతో రకుల్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తనకు మొదటి బ్రేక్‌ను ఇచ్చింది. ఆ తర్వాత అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.